Wednesday, February 18, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమెదక్‌లో మార్మోగిన నినాదం – సారు వస్తేనే రాష్ట్రానికి శ్రేయస్సు

మెదక్‌లో మార్మోగిన నినాదం – సారు వస్తేనే రాష్ట్రానికి శ్రేయస్సు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్.ఫిబ్రవరి18
రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ “సారు రావాలి – సర్కార్ రావాలి” అని కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మెదక్ జిల్లా అధ్యక్షురాలు పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సజావుగా సాగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన గాడిన పడలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై పట్టులేకపోవడంతోనే బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, మహిళలకు తులం బంగారం, వికలాంగులకు రూ.4000 పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల మధ్య ఢిల్లీలో దోస్తీ, గల్లీలో దుష్మన్ విధానంతో అనైతిక పొత్తులు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ పదవులను చేజిక్కించుకున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎం. రాజు, ఎం. స్వామి, బి. సిద్దిరాములు, బి. మురళి, నిరుడి సందీప్, బి. రమేష్, బి. ప్రవీణ్, బి. నాగరాజు, బి. కృష్ణ, ఎం. మోహన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular