నేరేడుచర్ల (మనప్రజాప్రతినిధిదినపత్రిక)
సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఆరిబండి శ్రీరామయ్య మృతి ఆ పార్థికి తీరనిలోటని అఖిల భారత యువజన సమైక్య సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను అన్నారు.ఆదివారం నాడు ఆయన పార్దివదేహానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1982లో మేడారం గ్రామ సర్పంచిగా, అనంతరం ఎంపీటీసీగా గెలిచి, 1996 నుండి 2001 వరకు మండల పరిషత్ చైర్మన్ గా చిరస్థాయి వరకు ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, సిపిఎం పార్టీలో హుజూర్నగర్ డివిజన్ కమిటీ సభ్యునిగా దాదాపు 30 సంవత్సరాలు పాటు సేవలు అందించి గ్రామీణ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసి, కమ్యూనిస్టు భావజలాన్ని గ్రామస్థాయిలో విస్తరించడంలో కీలక పాత్ర వహించిన మహానుభావుడని, ప్రజా ఉద్యమాల్లో నిరంత పోరాట చేస్తూ తన జీవితాన్ని ఎర్రజెండా ఆశయాలకు కట్టుబడి పని చేసిన శ్రామికవేత్తని, గ్రామీణ స్థాయి నుండి కమ్యూనిస్టు భావజాలాన్ని విస్తరించడంలో తనదైన పాత్ర పోషించిన కమ్యూనిస్టు నేత, నేటి యువతకు ఆదర్శప్రాయుడని, ఇలాంటి నిస్వార్థ కమ్యూనిస్టునేతల త్యాగాలను నేటి యువత గుర్తించాలని, వారి కుటుంబానికి ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రావుల సత్యం, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమరాజు వెంకట్, సిపిఎం సీనియర్ నాయకులు మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు

