Saturday, March 7, 2026
ads
Homeతెలంగాణఅక్బర్పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై హరీష్ గౌడ్ చేతుల మీదుగా  ప్రజాప్రతినిధి పత్రిక క్యాలెండర్...

అక్బర్పేట్ భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై హరీష్ గౌడ్ చేతుల మీదుగా  ప్రజాప్రతినిధి పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్–భూంపల్లి,

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని అక్బర్పేట్–భూంపల్లి మండల పోలీస్ స్టేషన్‌లో ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ మరియు మన ప్రజాప్రతినిధి తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్సై హరీష్ గౌడ్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ప్రజలకు సూచించారు. అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా మీడియా ప్రతినిధులు సమాజానికి ఉపయోగపడే వార్తలను ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ మరియు మన ప్రజాప్రతినిధి తెలుగు దినపత్రిక మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular