Thursday, March 26, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం – పుకార్లపై అప్రమత్తంగా ఉండాలి

పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం – పుకార్లపై అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి/మార్చి24.సిద్దిపేటనియోజకవర్గం..

పెట్రోల్,డీజిల్ కొరతపై పుకార్లు-IOCLఖండన
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) స్పష్టం చేసింది.దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, ఎక్కడా కొరత లేదని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో భారీగా ఇంధనం కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక రద్దీ ఏర్పడుతున్నదని పేర్కొన్నారు.కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అనవసర ఆందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఎలాంటి సమస్యలేదని, సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని వెల్లడించారు.అందువల్ల ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మకుండా, అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం వినియోగించాలని, అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
పుకార్లను నమ్మవద్దు – అప్రమత్తంగా ఉండండి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular