•29 ఏళ్ల సేవలకు ముగింపు–గుర్రం కృష్ణారెడ్డికి భావోద్వేగ వీడ్కోలు మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా.మార్చి1
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎన్గల్)లో ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన గుర్రం కృష్ణారెడ్డి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా శనివారం పాఠశాల ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజల సమక్షంలో కార్యక్రమం హృదయాన్ని హత్తుకుంది.ముఖ్య అతిథులుగా హాజరైన డిటిఎఫ్ పూర్వ అధ్యక్షులురఘుశంకర్ రెడ్డి, మండల విద్యాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ… కృష్ణారెడ్డి గారు విద్యా రంగంలో చూపిన అంకితభావం అభినందనీయం అన్నారు. ఆయన విద్యార్థుల అభివృద్ధి కోసం చేసిన కృషి చిరస్మరణీ యమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
“విద్యార్థులే నా బలం” – కృష్ణారెడ్డి
సన్మాన గ్రహీత కృష్ణారెడ్డి గారు భావోద్వేగంతో మాట్లాడుతూ… 29 ఏళ్ల సేవా కాలంలో విద్యార్థులతో ఏర్పడిన అనుబంధం తన జీవితంలో అమూల్యమని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి తనకు గౌరవం, గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో వంగ తిరుపతి (ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు), మల్లేశం (కాంప్లెక్స్ హెడ్ మాస్టర్), వి. రాజిరెడ్డి (డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు), బూర సదానందం (ఆడిట్ కమిటీ సభ్యులు), ఎ. సుధాకర్ రెడ్డి (డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు)తో పాటు మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సహచర ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొని కృష్ణారెడ్డి గారికి ఘనంగా శాలువాలు కప్పి సన్మానించారు.
గుర్రం కృష్ణారెడ్డికి ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
RELATED ARTICLES

