•కొండపాకలో విద్యార్థులకు ఫ్రూట్ డ్రింక్, గ్లూకోస్ ప్యాకెట్ల పంపిణీ
మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:ఏప్రిల్11
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, సిద్దిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోదని మరియు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ ఆర్థిక సహకారంతో శుక్రవారం కొండపాక జెడ్పి హెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు మ్యాంగో ఫ్రూట్ డ్రింక్, గ్లూకోస్ ప్యాకెట్స్, టూత్ పేస్టులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, కొండపాక గ్రామ సర్పంచ్ మంచాల నవీన్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పాఠశాల పిడి నర్రా భాస్కర్ రెడ్డి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగా, పలువురు ఆయన సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. శ్రీలత, అశోక్, బొలగం తిరుపతి, యాల రవీందర్ రెడ్డి, పి. బాలకిషన్, శోభారాణి, డి. శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషకాహార సహాయం-లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం.
RELATED ARTICLES

