📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుహుస్నాబాద్ కోర్టు తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి.

హుస్నాబాద్ కోర్టు తరలింపు నిర్ణయాన్ని విరమించుకోవాలి.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//

హుస్నాబాద్, నవంబర్ 22:

బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబుహుస్నాబాద్:హుస్నాబాద్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయస్థానాన్ని ప్రస్తుత పట్టణ ప్రాంతం నుంచి మండలంలోని అటవీ శివారు ప్రాంతానికి తరలించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుస్నాబాద్‌ ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్‌ బాబు మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ కోర్టు దశాబ్దాలుగా పట్టణ నడిబొడ్డున ఉండటం వల్ల స్థానిక ప్రజలకు, న్యాయవాదులకు, కక్షిదారులకు ఎంతో అందుబాటులో ఉందని తెలిపారు. కోర్టును పట్టణానికి దూరంగా, అటవీ ప్రాంతంలోకి తరలించడం వల్ల ప్రజావసరాలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు.కొత్త ప్రాంతానికి రవాణా సౌకర్యాలు సరిగా లేక కక్షిదారులు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుతం కోర్టుకు 1.33 గుంటల విశాలమైన స్థలం అందుబాటులో ఉందని.. ఒకవేళ భవిష్యత్తులో సబ్‌ కోర్టు మంజూరైనా, ఈ స్థలంలోనే అద్భుతమైన నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మించవచ్చని స్పష్టం చేశారు.సిద్ధిపేట (27 గుంటలు), హుజూరాబాద్‌ (30 గుంటలు) కోర్టులు సైతం తక్కువ స్థలంలోనే ఉండి పట్టణ కేంద్రాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందాయని ఉదహరించారు.న్యాయవాదులు, కక్షిదారుల ఇబ్బందులను, ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ పక్షాన డిమాండ్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లి లక్ష్మయ్య, అకోజు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరామ్, కోశాధికారి బుర్ర రాజు, సీనియర్ నాయకులు వరియోగుల అనంతస్వామి, ఆశాడపు శ్రీనివాస్, నారోజు నరేష్, లకవాత్ శారద, బీసా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.