Friday, February 27, 2026
ads
Homeఇంటర్నేషనల్ఆపరేషన్ సిందూర్ — సివిల్ మిలటరీ సమన్వయానికి నిదర్శనం

ఆపరేషన్ సిందూర్ — సివిల్ మిలటరీ సమన్వయానికి నిదర్శనం

📰 Generate e-Paper Clip

లబ్స్నా 100వ కామన్ ఫౌండేషన్ కోర్స్ వాలెడిక్టరీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగం
ఇంటిగ్రిటీ, టెక్నాలజీ ఇన్నోవేషన్‌పై యువ సివిల్ సర్వెంట్లకు పిలుపు
శాస్త్రి, సర్దార్ పటేల్‌కు నివాళులు
ముస్సూరీ, నవంబర్ 29 (మనప్రజాప్రతినిధి):
లాల్ బహాదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో నిర్వహించిన 100వ కామన్ ఫౌండేషన్ కోర్స్ వాలెడిక్టరీ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ను సివిల్–మిలటరీ ఫ్యూజన్‌కు ప్రతిష్టాత్మక ఉదాహరణగా అభివర్ణించారు.భారత యువ సివిల్ సేవకులు నైతికత, బాధ్యత, సానుభూతి, టెక్నాలజీ వినూత్నతను ఆధారంగా చేసుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత భారత్ సాధనలో తమ పాత్ర అత్యంత కీలకమని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ‘మినిమం గవర్నమెంట్ – మాక్సిమం గవర్నెన్స్’ దృక్పథాన్ని అవలంబిస్తూ, సమర్థవంతమైన పాలనను అందించాలని సూచించారు.
సివిల్ సర్వీసుల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యాన్ని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. సేవాస్ఫూర్తి, అంకితభావంతో పనిచేస్తున్న మహిళా అధికారుల ఎదుగుదల భారత ప్రజాసేవ వ్యవస్థ బలపాటుకు దోహదపడుతుందన్నారు. అలాగే, దేశానికి అపార సేవలు అందించిన మాజీ ప్రధానమంత్రి లాల్ బహాదూర్ శాస్త్రి, భారత ఐక్యతకు ప్రాణం పోసిన సర్దార్ వల్లభభాయి పటేల్కు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అకాడమీలో ఏర్పాటు చేసిన పేవిలియన్ ను ప్రారంభించారు. భారత పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి లక్ష్యంగా రూపొందించిన ఈ కోర్సు 100వ ఎడిషన్ విజయవంతంగా పూర్తవడం దేశ సివిల్ సేవా వ్యవస్థలో కీలక మైలురాయిగా భావించబడుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular