📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామం కోసం కష్టపడేవారినే ఎన్నుకోవాలి: రాంపల్లి రాజు

గ్రామం కోసం కష్టపడేవారినే ఎన్నుకోవాలి: రాంపల్లి రాజు

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్ 2
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజలు సరైన నాయకులను ఎన్నిక చేసుకోవాలని రాంపల్లి రాజు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గ్రామంలోనే నివసిస్తూ, గ్రామ అభివృద్ధి కోసం నిజమైన శ్రమ పెట్టే వ్యక్తులను సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎంపిక చేయాలి” అని సూచించారు.గ్రామంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే స్పందించి సహాయం చేసేవ్యక్తినాయకుడిగా ఉండాలి.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, సమస్యలు విన్న వెంటనే స్పందించే అభ్యర్థినే ప్రజలు ఎన్నుకోవాలి.
డబ్బులు, మద్యానికి, ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన ఓటు హక్కును వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాంపల్లి రాజు మాట్లాడుతూ, “ఇది గ్రామ భవిష్యత్‌ను తీర్చిదిద్దే అవకాశం. నిజమైన నాయకుడిని ఎన్నుకునే సమయం ఇది. ప్రజలు కొంచెం ఆలోచనతో, జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో పాల్గొనాలి” అని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular