మనప్రజాప్రతినిధి//రేణిగుంటమండలం.డిసెంబర్ 2
రేణిగుంట పట్టణంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించే దిశగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని మండల పార్టీ అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోహన్ బాషా తెలిపారు.
ఇళ్ల స్థలాల సమస్యను కలెక్టర్ వెంకటేశ్వర్, రాష్ట్ర ఇంచార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారని వారు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో పేదలకు పక్కా ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ అసలు స్థలాలు కేటాయించకపోవడం వల్ల ప్రజలు మోసపోయారని విమర్శించారు.
ప్రస్తుతం అర్హులైన కుటుంబాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ సిస్టమ్ యాక్సెప్ట్ చేయకపోవడం సమస్యగా మారిందని తెలిపారు. రేణిగుంట పట్టణంలో సుమారు 3,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చర్యలు ప్రారంభించారని, అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చర్యలు – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
RELATED ARTICLES

