📄 ePaper
Thursday, October 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామాభివృద్ధి కోసమే సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ రమ్య,రవీందర్ గౌడ్

గ్రామాభివృద్ధి కోసమే సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ రమ్య,రవీందర్ గౌడ్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం. డిసెంబర్4
జప్తి నాచారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వడ్లకొండ రమ్య, రవీందర్ గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుత  గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ప్రజల ముందుకు వచ్చానని తెలిపారు.
నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామ ప్రజలు, గ్రామ యువత కోసం నిరంతరం సేవ చేస్తానని రమ్య అన్నారు. అధికారం ఉన్నా లేకున్నా గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను విని పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజల అండదండాలతో గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని, నాయకురాలిగా కాకుండా గ్రామానికి సేవకురాలిగా గ్రామాభివృద్ధికి పనిచేయాలనుకుంటున్నానని రమ్య స్పష్టం చేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింలు, గజ్వేల్ ఆత్మ కమిటీ డైరెక్టర్ పబోజు వీరబ్రహ్మం, పుల్లూరు రాములు, దోమల మధు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.