📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసారలక్ష్మి8వ వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

సారలక్ష్మి8వ వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లామనప్రజాప్రతినిధి//డిసెంబర్5
8వ వార్డు మెంబర్‌గా శివాయిపల్లి గ్రామానికి చెందిన సార లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. “నా వార్డు ప్రజలు నాకు చూపిన నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆడబిడ్డగా, మీ కూతురిగా ప్రజాసేవ కోసం ముందుకు వచ్చాను’’ అని ఆమె అన్నారు.
“నన్ను గెలిపించి తీరుతామని, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 8వ వార్డు అభివృద్ధి కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తాను. దయచేసి నాకు మీ ఆశీర్వాదం, మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. గెలిపిస్తే వచ్చే 5 సంవత్సరాలు ప్రజలకు రుణపడి సేవ చేస్తాను’’ అని సార లక్ష్మి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.