మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్5
దుద్దెడ గ్రామ సర్పంచ్ పదవికి అభ్యర్థిగా శివకుమార్ గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన“దుద్దెడ గ్రామ అభివృద్ధి చేయాలంటే కష్టపడే నాయకుడు అవసరం. ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే, ప్రతి వ్యక్తి సమస్యను నా సమస్యగా తీసుకొని పరిష్కరించేందుకు అహర్నిశలు శ్రమిస్తాను. సమాజ సేవకుడిగా నిజాయితీ, నమ్మకంతో గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తా’’ అని తెలిపారు.దుద్దెడ ప్రజలకు నిరంతరం సేవలు అందించడమే తన లక్ష్యమని శివకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లి నాగులు, ఖలీల్, ప్రదీప్, జి. కూరు యాదగిరి, మహమ్మద్ నవీన్, కందుల కరుణాకర్, చిలుముల కనకయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామఅభివృద్ధికోసంకృషిచేస్తా: సర్పంచ్ అభ్యర్థిశివకుమార్
RELATED ARTICLES

