📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇరుకోడు గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ఊపందుకుంది

ఇరుకోడు గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ఊపందుకుంది

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటరూరల్.ఇరుకోడు,డిసెంబర్ 10
సిద్దిపేట నియోజకవర్గంలోని రూరల్ మండలం ఇన్చార్జిగా మార్క సతీష్ కుమార్ నేతృత్వంలో ఇరుకోడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున బుధవారం ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేశారు.కొడారి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో మార్కా రాహుల్ గౌడ్, సురేష్, నాయిని నరసింహారెడ్డి, భవాని, బీజాని ఎల్లవ్వ సహా వార్డు సభ్యులు పాల్గొన్నారు.అభ్యర్థుల గెలుపు కోసం మల్లారెడ్డి గారికి మరింత కృషి చేయాలని కోరుతూ, మండల ఇన్చార్జి మార్క సతీష్ కుమార్ వ్యక్తిగతంగా ₹10,000 ఆర్థిక సహాయం అందించారు.సిద్దిపేట జిల్లా మంత్రివ ర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో పాటు, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి సూచనల మేరకు ఈ ప్రచారం నిర్వహించినట్టు మార్క సతీష్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయం ప్రతి కార్యకర్త బాధ్యత అని, అందరూ ఏకతాటిపై పనిచేస్తున్నామని చెప్పారు.ప్రచారంలో పాల్గొన్న మహిళా నాయకులు, యువత, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.