📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్చేనేత రంగం పునరుద్ధరణకు సమగ్రయత్నం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం

చేనేత రంగం పునరుద్ధరణకు సమగ్రయత్నం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పష్టం

📰 Generate e-Paper Clip

చేనేత అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి.డిసెంబర్10
శ్రీకాళహస్తి చేనేత క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అవగాహన సదస్సులో నేతన్నల అభివృద్ధి గురించి మాట్లాడిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, చేనేత రంగ పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత విస్తృతం కావాలని తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పర్యవేక్షణతో చేనేత రంగానికి కొత్త ఊపిరి వస్తోందని తెలిపారు.13న పనిముట్ల పంపిణీ192 మంది నేతన్నలకు చేనేత మంత్రి సవిత గారి చేతుల మీదుగా పనిముట్ల పంపిణీ జరగనుందని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని నేతన్నలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భాస్కరపేటలో ఘన సన్మానం
అవగాహన సదస్సు జరుగిన భాస్కరపేటలో:యూనిట్ ఇంచార్జి సల్లా గోవిందు పుష్పగుచ్ఛంతో ఎమ్మెల్యేకు స్వాగతంచేనేత రాష్ట్ర కమిషనర్ రేఖా రాణి, ఏడి రమేష్ సమక్షంలో శాలువాతో సత్కారంసీనియర్ నేతన్న కన్నా వెంకటేశ్వర్లు స్వయంగా నేసిన వస్త్రంతో ఘనంగా సత్కరించారుఈ సందర్భంగా నేతన్నలు తమ సమస్యలు, అవసరాలను ఎమ్మెల్యే మరియు కమిషనర్‌లకు వివరించారు.చేనేత రంగ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబాటుఎమ్మెల్యే మాట్లాడు తూప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి పలు కార్యక్ర మాలుచేపట్టిందని తెలిపారు. వాటిలో:చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంపుకొత్త డిజైన్‌లు, ఆధునీకరణ దేశీయ – అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ నేతన్నలకు మొడర్న్ పనిముట్ల అందజేత శిక్షణ, నైపుణ్యాభి వృద్ధి కార్యక్రమాలు వంటివి ముఖ్యమని చెప్పారు.“ చేనేత కుటుంబాల్లోస్థిరపాటు,ఆదాయవృద్ధి, నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ చేనేత రంగానికి కొత్త దిశ చూపుతోంది’’ అని ఎమ్మెల్యే అన్నారు.
ప్రతి గ్రామంలో చేనేత కార్యక్రమాలు నిర్వహించాల్సిందే
నేతన్నల అభివృద్ధి గ్రామస్థాయికి చేరాలంటే ప్రతి గ్రామంలో చేనేత అవగాహన సమావేశాలు ఏర్పాటు కావాలని ఎమ్మెల్యే సూచించారు. క్లస్టర్ల ద్వారా పరికరాలు, శిక్షణ, మార్కెట్ మద్దతు మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
నేతన్నల తరపున కృతజ్ఞతలు
క్లస్టర్ ఏర్పాటుకు, నేతన్నల అభివృద్ధికి అండగా నిలిచిన ఎమ్మెల్యే, కమిషనర్ రేఖా రాణి, ఎమ్మెల్యే సతీమణి ఋషిత రెడ్డి వారికి ఏపీ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం కన్వీనర్ గుత్తి త్యాగరాజు నేతన్నల తరపున కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న వారుఏఎంసీ చైర్మన్ చెంచమ నాయుడు
ఆలయ బోర్డు సభ్యుడు ఇర్ల గోపి చేనేత ఏడి రమేష్ & సిబ్బంది
సీనియర్ నేతన్నలు సుమారు 200 మంది పాల్గొన్నారు చేనేత రంగానికి ప్రభుత్వం మరింత మద్దతు ఇవ్వాలని నేతన్నల అభిలాషపనిముట్ల అందజేత, శిక్షణా కార్యక్రమాలు, ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, స్థిరమైన మార్కెట్, నేరుగా విక్రయ వేదికలు, చేనేతకు ప్రత్యేక సబ్సిడీలు వంటి అంశాలు కూడా విస్తృతంగా అమలవాలని నేతన్నలు అభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యే ఈ సమస్యల ను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లాలని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.