📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమానేరులో మృతి చెందిన యువకుడు అనుమానాస్పద ఘటన

మానేరులో మృతి చెందిన యువకుడు అనుమానాస్పద ఘటన

📰 Generate e-Paper Clip

వట్టెంల గ్రామంలో తీవ్ర విషాదం

పోలీసులుప్రస్తుతం రెండు కోణాల్లో విచారణ ముమ్మరం చేస్తున్నారు ✔ హత్య..?
✔ ఆత్మహత్య..?
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్12
వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో దుస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన కాసారపు అభిలాష్ (29) అనే యువకుడు నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో అభిలాష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విచారంలో మునిగిపోయారు.అభిలాష్ స్వయంగా మానేరులో దూకాడా? లేక ఎవరైనా హత్య చేసి అక్కడికి తీసుకువచ్చారా? అనే అనుమానాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు.
గ్రామమంతా శోకం వీడకుండానే…అభిలాష్ మరణం వెనుక అసలు మిస్టరీ ఏమిటి? అనే ప్రశ్నలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.