📄 ePaper
Friday, July 10, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుభూంపల్లి అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన వంశీధర్ రెడ్డికి మద్దతు వెల్లువ

భూంపల్లి అభివృద్ధి కోసం కాంగ్రెస్ బలపరిచిన వంశీధర్ రెడ్డికి మద్దతు వెల్లువ

📰 Generate e-Paper Clip

✂️ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లిమండలం,దుబ్బాకనియోజకవర్గం, సిద్దిపేట జిల్లాడిసెంబర్ 12
అక్బర్ పేటభూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎల్లన్న గారి వంశీధర్ రెడ్డికి కత్తెర గుర్తుకు ✂️ ఓటు వేసి గెలిపించాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.సర్పంచ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన భూంపల్లి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ“ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పుడే గ్రామాల్లో నిజమైన అభివృద్ధి, ప్రతి ఇంటికి నిజమైన సంక్షేమం చేరుతోంది” అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తదుపరి పథకాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు:
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.కుటుంబాలకు ₹500 గ్యాస్ సిలిండర్.200 యూనిట్ల ఉచిత విద్యుత్.రైతు రుణమాఫీ.మహిళా సంఘాలకు రుణాలు.ఇందిరమ్మ ఇండ్లు పథకంఈ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని, గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.గ్రామ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్ర మాల పురోగతికి ఎల్లన్న గారి వంశీధర్ రెడ్డినే సరైన నాయకుడని, ఆయనను సర్పంచ్‌గా గెలిపించి గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్లాల ని గ్రామ ప్రజలను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు,యువత,మహిళలు తదిత రులువిస్తృతంగాపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular