📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,డిసెంబర్‌14(మనప్రజాప్రతినిధి)
మండల కేంద్రం పాపన్నపేటలోని అయ్యప్ప స్వామి క్షేత్ర సన్నిధానానికి చెందిన అయ్యప్ప స్వాములు ఆదివారం భక్తిశ్రద్ధలతో శబరిమల యాత్రకు బయలుదేరారు. 41 రోజుల పాటు కఠోరమైన దీక్షలు, నియమ నిబంధనలను క్రమంగా పాటించిన అనంతరం ఇరుముడి ధరించి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పయన మయ్యారు.ఈ సందర్భంగా కృష్ణ గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వాములకు ఇరుముడి కట్టారు. అనంతరం 18 మెట్ల పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించి, ఇరుముడిని నెత్తిన ధరించి శబరిమల యాత్రకు బయలుదేరారు.ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వాముల బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో హాజరై స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు. పాపన్నపేటలో భక్తి వాతావరణం నెలకొని, జై అయ్యప్ప నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.