మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తిమండలం.డిసెంబర్18
శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం తప్పుడు కేసుగా పేర్కొని కొట్టివేసిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ-భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు పాలకపక్షం చేస్తోందని విమర్శించారు. నేడు సత్యమే గెలిచిందని, ప్రజాభిక్షకు అనుగుణంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో మచ్చలేని కుటుంబంగా గాంధీల కుటుంబం నిలిచిందని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, ముని కృష్ణయ్య, నాగరాజు, చరణ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యమేవ జయతే-కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు తలపా దామోదరంరెడ్డి
RELATED ARTICLES

