📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్పోలియో చుక్కలే పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం-విస్తృత అవగాహన కల్పించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రియ

పోలియో చుక్కలే పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం-విస్తృత అవగాహన కల్పించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రియ

📰 Generate e-Paper Clip

ఒక్క చుక్కతో జీవితాంతం రక్షణ-పోలియో చుక్కలపై మండలవ్యాప్తంగా అవగాహన
పోలియో రహిత సమాజమే లక్ష్యం – చైతన్యంతో ముందుకెళ్లిన ఏర్పేడు మండలం.
ఐదు ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరి పోలియో చుక్కలు – డాక్టర్ శివప్రియ పిలుపు.
పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు-పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమం.
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్20
పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అని చాటిచెప్పే విధంగా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో పోలియో నిర్మూలన కార్యక్రమానికి గట్టి బాట వేసారు. డిసెంబర్ 21వ తేదీన నిర్వహించనున్న జాతీయ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఏర్పేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రియ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలో సేవలందిస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఉద్దేశించి డాక్టర్ శివప్రియ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగిన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాల్సిన బాధ్యత మనందరిదే అని స్పష్టం చేశారు. పోలియో వ్యాధి చిన్నారి జీవితాన్నే అంగవైకల్యంతో నింపే ప్రమాదం ఉన్నదని, ఒక్క చుక్క కూడా పిల్లల భవిష్యత్తును కాపాడుతుందని ఆమె వివరించారు.
ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న తల్లిదండ్రులకు పోలియో చుక్కల ప్రాముఖ్యతపై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. “ఏ ఒక్క పిల్లవాడు కూడా పోలియో చుక్కలు తప్పకుండ వేసుకోవాలి ” అనే నినాదంతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను చైతన్యపరిచే విధంగా పనిచేయాలని ఆదేశించారు.ఆదివారం రోజున జరిగే పోలియో చుక్కల కార్యక్రమం గురించి ముందుగానే గ్రామాల్లో ప్రచారం చేయాలని, బూత్‌ల వద్ద పిల్లలను తీసుకొచ్చేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే వైద్య బృందాలు మారుమూల గ్రామాలకు నేరుగా వెళ్లి పోలియో చుక్కలు వేయాలని ఆమె సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు చురుకుగా పాల్గొని పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. డాక్టర్ శివప్రియ నేతృత్వంలో ఈ కార్యక్రమం ద్వారా ఏర్పేడు మండలాన్ని పోలియో రహిత మండలంగా తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తమైంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.