📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచేగుంట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా సండ్రుగు స్రవంతి సతీష్ ఏకగ్రీవ ఎన్నిక

చేగుంట మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా సండ్రుగు స్రవంతి సతీష్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా,చేగుంట.డిసెంబర్20
చేగుంట మండల రాజకీయ వేదికపై కీలక పరిణామం చోటు చేసుకుంది. మండలంలోని అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్‌ల ఏకాభిప్రాయంతో చేగుంట పట్టణ గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.చేగుంటలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్‌లో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన గెలుపొందిన సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో హాజరై, మండల స్థాయిలో ఐక్యతతో ముందుకు సాగాలనే సంకల్పంతో సండ్రుగు స్రవంతి సతీష్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.గ్రామాల అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని నూతన అధ్యక్షులు సండ్రుగు స్రవంతి సతీష్ ఈ సందర్భంగా తెలిపారు. సర్పంచ్‌ల హక్కులు, గ్రామ పంచాయతీలకు న్యాయం జరిగేలా మండల సర్పంచ్‌ల ఫోరం వేదికగా నిరంతరం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులుగా గుర్జ కుంట సుకన్య నాగులు, ప్రధాన కార్యదర్శిగా కోండి రాజ్యలక్ష్మి స్వామిలను ఎన్నుకున్నారు. కొత్త కమిటీ సభ్యులను సర్పంచ్‌లు ఘనంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు తాడేపు వెంగల్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్, మహేష్, చందాయిపేట సర్పంచ్ తాలూకా మహేశ్వరి సాయిబాబా, కిష్టాపూర్ సర్పంచ్ జ్యోతి శ్రవణ్, పోలిమామిడి సర్పంచ్ రాయపల్లి శ్రీనివాస్ రెడ్డి, చిన్న శివనూర్ సర్పంచ్ సుంచన్ కోట వరలక్ష్మి, అన్నంతసాగర్ సర్పంచ్ శ్రీధర్, కన్యారం సర్పంచ్ కర్రే పుష్ప, రెడ్డిపల్లి సర్పంచ్ నర్సిములు, సోమ్లా తండా సర్పంచ్ ప్రవళిక రమేష్, తిమ్మాహిపల్లి సర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ, సీనియర్ నాయకులు పూర్ర ఆగమయ్య, యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, రాజు, కన్యారం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.