📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునూతనంగాఎన్నికైన ఉపసర్పంచ్,వార్డుమెంబర్లకు ఘనంగా బీజేపీ సన్మానం

నూతనంగాఎన్నికైన ఉపసర్పంచ్,వార్డుమెంబర్లకు ఘనంగా బీజేపీ సన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్
మనకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.వెంకట్రావుపల్లి గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నికైన అనగోని అవినాష్, అలాగే వంతడుపుల గ్రామ 5వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నాయిని శ్రీనివాస్‌లను బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్ కుమార్ శాలువాలు కప్పి సత్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి నూతన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని, బీజేపీ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బత్తిని సాయి గౌడ్, సీనియర్ నాయకులు దేశెట్టి శ్రీనివాస్, మేకల మల్లేశం, మండల నాయకులు పినికాసి అనిల్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.