📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుబేడబుడగ జంగం రాజకీయంగా ఎదగాలిరానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలి-డొక్కరాజేష్ పిలుపు

బేడబుడగ జంగం రాజకీయంగా ఎదగాలిరానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలి-డొక్కరాజేష్ పిలుపు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్24
రాజన్న సిరిసిల్ల జిల్లా బేడబుడగ జంగం కమిటీ సభ్యులు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 మందికి పైగా పోటీ చేసినట్లు కమిటీ సభ్యుడు డొక్క రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడబుడగ జంగం వర్గాలు రాజకీయంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన, ఓడిన అభ్యర్థులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. బేడబుడగ జంగం అంటేనే వెనుకబడిన వర్గమని ముద్ర వేయకుండా, వారికి విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
నాటి నుండి నేటి వరకు అన్యాయానికి గురవుతున్న జాతి ఏదైనా ఉందంటే అది బేడబుడగ జంగమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బేడబుడగ జంగం వర్గానికి చెందిన వారు మరింత ధైర్యంగా ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారానే హక్కులు, అవకాశాలు సాధ్యమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విభూది హన్మతు, అనరాశి జలంధర్, చింతల రంగయ్య, వానరాశి అశోక్, చింతం పోశెట్టి, కడమంచి శేఖర్, మ్యాకల మహేష్, విభూది రవి, అనరాశి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular