•పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం : ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి
సిద్దిపేట,డిసెంబర్24 (మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో ఈ నెల 26న జరగనున్న వీర్ బాల్ దివస్ ను పురస్కరించుకుని వ్యాస రచన పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు.సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ విభాగానికి చెందిన శ్రీ వేణుగోపాల్ గారు, రీజనల్ కమిషనర్ శ్రీమతి పావని మేడం గారి సూచనల మేరకు విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించారు.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.•మొదటి బహుమతి-ఎంఎల్టీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆర్షియా తబస్సుం•రెండో బహుమతి-సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి అభిలాష్ రెడ్డి•మూడో బహుమతి – ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జ్యోతి.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, పర్యావరణ పరిశుభ్రతను పాటించినప్పుడే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు.మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీమతి ఫాతిమా మేడం మాట్లాడుతూ, మానవ హక్కులు, బాలల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.జిల్లా పరిధి అధికారి శ్రీ వేణుగోపాల్ గారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి నవ సమాజ నిర్మాతలు అని పేర్కొంటూ, అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవాలంటే యువత మంచి విద్యతో పాటు దృఢ సంకల్పంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సివిక్స్ అధ్యాపకులు నంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, వీర్ బాల్ దివస్ ను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2022లో ప్రారంభించారని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జాతీయ స్థాయిలో జరుపుకుంటామని తెలిపారు. ఈ రోజు గురు గోవింద్ సింగ్ జీ కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ల ధైర్యం, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకుంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దరిపల్లి నగేష్, ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, అఖిల్, శ్రీకాంత్, సత్యనారాయణ, రాజశేఖర్, విజయ్, వెంకట రమణ, నరేందర్ రెడ్డి, రవి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వీర్ బాల్ దివస్ సందర్భంగా వ్యాస రచన పోటీలు
RELATED ARTICLES

