📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న తలపా దామోదరం రెడ్డి.

క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న తలపా దామోదరం రెడ్డి.

📰 Generate e-Paper Clip

అన్ని మతాల సమాన గౌరవమే కాంగ్రెస్ సిద్ధాంతం – తలపా
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి మండలం.డిసెంబర్ 25
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మండలం విశాలాక్షి నగర్‌లోని హెబ్రోన్ చర్చ్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీసమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి తలపా దామోదరం రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, దేశంలో మత సామరస్యాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.ఏసుప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, మానవత్వ విలువలు నేటి రాజకీయాలకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టే శక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆంటోనీ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్, బద్రి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించిన ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షపాత రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular