సదాశివపేట,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభు మందిర్ ఆలయం సమీపంలో వెలసి ఉన్న శ్రీ కాశమ్మ అమ్మవారి దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మాన్ని స్థానిక 11వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ వోదెల రాజేశ్వరి–మాణిక్ రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.వార్షికోత్సవ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాశమ్మ తల్లికి కళాశాల ఊరేగింపును నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం చేసి, వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. తరువాత డప్పు చప్పుళ్లు, మేళతాళాల మధ్య పురవీధుల గుండా బోనాల ఊరేగింపును నిర్వహించి అమ్మవారికి సమర్పించారు.అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ ఎంపీ బి.బి. పాటిల్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు దేశ్ పాండే, తాజా మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మాజీ పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్, సుధాకర్, మోహన్ రెడ్డి, పురాన్ సింగ్, కల్పగూరి విజయ్, బల్లెం లక్ష్మయ్య, చిదానందం, ఎం. విజయ్ యాదవ్, ప్రవీణ్, పవన్ గౌడ్, విట్టల్, అంజి, అలాగే మహిళలు ధనమ్మ, భారతమ్మ, రాజేశ్వరి, ఉష, మంజీర, అనురాధ, స్వరూప, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శ్రీ కాశమ్మ అమ్మవారి ప్రథమ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బి.బి. పాటిల్
RELATED ARTICLES

