Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుజర్నలిస్టులందరికీ సమాన అక్రెడిటేషన్లు ఇవ్వాలి

జర్నలిస్టులందరికీ సమాన అక్రెడిటేషన్లు ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

జీవో 252ను వెంటనే రద్దు చేయాలి: రూప్ సింగ్ డిమాండ్
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట భూంపల్లిమండలం,దుబ్బాకనియోజకవర్గం.సిద్దిపేట జిల్లాడిసెంబర్ 29
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ సమాన హక్కులతో అక్రెడిటేషన్లు ఇవ్వాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252ను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాదులోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రూప్ సింగ్, ఈ జీవోకు వ్యతిరేకంగా ప్రింట్.ఎలక్ట్రానిక్ మీడియా చేపడుతున్న ఉద్యమానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 23 వేల మందికి పైగా వివిధ విభాగాలకు చెందిన జర్నలిస్టులు ఉన్నారని, వారందరికీ సమాన హక్కులతో అక్రెడిటేషన్లు కల్పించేందుకు గత ప్రభుత్వం 2016లో జీవో 239ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులుగా విభజించి మీడియాను రెండు వర్గాలుగా చీల్చుతోందని ఆయన విమర్శించారు. డెస్క్ జర్నలిస్టులకు వేరు మీడియా కార్డులు ఇస్తామని చెప్పడం ద్వారా గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. రెండు రకాల అక్రెడిటేషన్లు ఉన్నప్పటికీ హక్కులు సమానమని ప్రభుత్వం చెబుతుంటే, వేర్వేరు పేర్లు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే మీడియాను కూడా సీఎం ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జీవో 252ను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.గత ప్రభుత్వ హయాంలో కూడా జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని, ఆరోగ్య కార్డులకు సంబంధించి న నిధులు సకాలంలో విడుదల కాలేదని గుర్తు చేశారు. దీనివల్ల అనారోగ్యానికి గురైన జర్నలిస్టుల కుటుంబాలు సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వం మీడియాను విభజించి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందనివిమర్శించిన రూప్ సింగ్, జీవో 252ను రద్దు చేసే వరకు తెలంగాణ జాగృతి జర్నలిస్టుల పోరాటాలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular