Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుపీహెచ్‌డీసాధించిన కాంగ్రెస్ నాయకుడు పెండ్యాల విక్రమార్కకు ఘన సన్మానం

పీహెచ్‌డీసాధించిన కాంగ్రెస్ నాయకుడు పెండ్యాల విక్రమార్కకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్29
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పీహెచ్‌డీ (Ph.D) పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెండ్యాల విక్రమార్క సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి సన్నిధిలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, అడ్వకేట్ నర్మేట రమేష్ ఆధ్వర్యంలో విక్రమార్కను మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, అపద్బాంధవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అక్కేనపల్లి భాస్కర్ విక్రమార్కను రాజన్న శాలువాతో ఘనంగా సత్కరించారు.
కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారు: అక్కేనపల్లి భాస్కర్ఈ సందర్భంగా అక్కేనపల్లి భాస్కర్ మాట్లాడుతూ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పట్టుదలతో పీహెచ్‌డీ సాధించి ఈ స్థాయికి ఎదగడం గర్వకారణమని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి, విద్యారంగంలోనూ రాణించిన పెండ్యాల విక్రమార్కకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పాల్గొన్న ముఖ్యులుఈ కార్యక్రమంలోనర్మేట రమేష్ (అడ్వకేట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు),అక్కేనపల్లి భాస్కర్ (భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు),నవీన్, గంగాధర్ (అడ్వకేట్లు),సారన్న, అఖిల్, జహీర్, సుకుమార్,నవీన్ (లడ్డు), నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular