📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువెల్జిపూర్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

వెల్జిపూర్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

మనకొండూరు,జనవరి1(మనప్రజాప్రతినిధి):
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానుకగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు ప్రకటించిన సైకిళ్లను వెల్జిపూర్ ప్రభుత్వ పాఠశాలలో నేడు పంపిణీ చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి దేశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, దూరప్రాంతాల విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనిడ్రాప్‌అవుట్స్ లేకుండా ఉండేందుకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే పదవ తరగతి విద్యార్థుల పరీక్షల ఫీజును కూడా చెల్లించడం జరిగిందన్నారు.పేద విద్యార్థుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చదువులో మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపా ధ్యాయులు స్వామి రెడ్డి, ఉపాధ్యాయులు అయ్యన్నగారి హరికృష్ణా రెడ్డి, కుమారస్వామి, అనురాధ, అరుణ, రాజిరెడ్డి, శ్రీనివాస్, బీజేపీ బూత్ అధ్యక్షులు బట్టి మోహన్, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular