సదాశివపేట, జనవరి 1 (మన ప్రజాప్రతినిధి):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ యువ నాయకులు కొత్త గొల్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణం లోని రాఘవేంద్ర నగర్ కాలనీ 8వ వార్డ్ లో గల ప్రేమ స్వరూపి చర్చి లో పాస్టర్ డేనియల్ రాజు తో కలిసి కేక్ కట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం అన్ని విధాల సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమ నిర్వాహకుడు కొత్త గొల్ల సోమశేఖర్ మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, శాంతి, అష్టైశ్వర్యాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్థానిక చర్చి పాస్టర్ బిషప్ ఎం. డానియల్ రాజ్ దేవుని వాక్యాలను బోధిస్తూ సమాజ మంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఎస్. జాన్వేసి, పి. ప్రేమ్ కుమార్, చెన్నాకర్, మురళీ గౌడ్, యాదుల్, హజ్జు, సంఘ పెద్దలు, మహిళలు, యువకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా ప్రేమ స్వరూపి చర్చిలో కేక్ కట్, అన్నదాన కార్యక్రమం
RELATED ARTICLES

