📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం

అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మెదక్.మనప్రజాప్రతినిధి//జనవరి3
అల్లాదుర్గం మండల పరిధిలోని కాయిదంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వంకిడి రేణుక చేతుల మీదుగా మూడు సంవత్సరాల వయస్సు నుండి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి తొలి అడుగు వేశారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాల పరిచయం చేసి, విద్య ప్రాధాన్యతను వివరించారు. చిన్న వయస్సులోనే చదువుపై ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ మంజుల, పాఠశాల హెచ్‌ఎం రంజా నాయక్, పంచాయతీ కార్యదర్శి నవీన్, మాజీ సర్పంచ్ బాల్రాజ్, గర్భిణీ స్త్రీలు, బాలికలు, పిల్లల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.చిన్నారుల విద్యాభివృద్ధికి అంగన్వాడి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular