•సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనిల్ కుమార్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి3
ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామ శాఖ సీపీఐ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, గ్రామ శాఖ కార్యదర్శి మంద అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్–మహాత్మా గాంధీ–తెలంగాణ తల్లి చౌరస్తాలో నిర్వహించా రు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి, అడ్వకేట్ కడగండ్ల తిరుపతి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నైగావ్‌లో జన్మించారని గుర్తు చేశారు. ఆమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్తగా భర్త జ్యోతిరావు పూలేతో కలిసి మహిళా విద్య, అంటరానితన నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం పోరాడారని తెలిపారు.1848లో మహిళా విద్యకు మార్గదర్శకంగా నిలిచిన సావిత్రిబాయి పూలే, బాలికలు మరియు నిమ్నవర్గాల పిల్లలకు విద్య నిషేధించిన కాలంలో పూణేలో బాలికల పాఠశాల స్థాపించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అవమానాలు, నిరసనలను ఎదుర్కొంటూనే ఆడపిల్లలకు అక్షరజ్ఞానం అందించిన ధైర్యవంతురాలిగా ఆమె నిలిచారని కొనియాడారు. స్త్రీలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం సాధ్యమని విద్య ద్వారానే నిరూపించిన మహా విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అనగోని అవినాష్, వార్డు సభ్యులు మంద బాలయ్య, జెట్టి నాగరాజు, మంద అనిల్ పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు ఐరెడ్డి రవీందర్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, మంద లింగం, దుద్దేడ బాల గౌడ్, మంద రాములు, మామిండ్ల కనకరాజు, నల్ల శ్రీహరి, ఎండ్ర యాదగిరి, భూమి రెడ్డి, ఎండ్ర చందన్, నర్సయ్య, మొగిలి, గొల్లపల్లి మల్లయ్య, కనుకరెడ్డి, రాజలింగం, రాజేశం, మహేష్, శ్రావణ్, నిఖిల్ తదితరులు హాజరయ్యారు.
మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా
RELATED ARTICLES

