Thursday, March 19, 2026
ads
Homeతెలంగాణహత్యకు గురైన యువకుడి భౌతికకాయాన్ని సందర్శించిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు

హత్యకు గురైన యువకుడి భౌతికకాయాన్ని సందర్శించిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//గద్వాల్:గద్వాలనియోజకవర్గంగట్టు మండలం మాచర్ల గ్రామ శివారు ఫారెస్ట్ లో బల్గెర గ్రామానికి చెందిన ఖయాన్ దారుణ హత్యకు గురై మృతి చెందాడు… విషయం తెలుసుకొని సంఘటనస్థలానికివెళ్లి,ఆయనభౌతికకాయానికిసందర్శించి,కుటుంబసభ్యులనుపరామర్శించారు.అదే విధంగా,హత్య కేసును మమ్మరంగా దర్యాప్తు చేసి,నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక సీఐ,ఎస్ఐ ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలతోనేరాష్ట్రంలోహత్యలుఎక్కువఅయ్యాయని,రాష్ట్రానికిహోంమంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు అగమ్యగోచరంగామారాయని బాసు హనుమంతు నాయుడు గారువిమర్శించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొనడం ప్రభుత్వ పాలన దయనీయ స్థితికి నిదర్శనమన్నారు. తక్షణమే హోంమంత్రిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.వీరి వెంట,బల్గెర సర్పంచ్ సాకి డేవిడ్,నూర్ పాషా,బాసుగోపాల్,సామెలు,లోకేష్,రాజు,వీరేష్,నాగేష్,నరసింహులు మరియు తదితరులు ఉన్నారు….

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular