📄 ePaper
Tuesday, June 30, 2026
Homeతెలంగాణబింగిదొడ్డి గ్రామంలో ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

బింగిదొడ్డి గ్రామంలో ఓట్ల లెక్కింపులో అన్యాయం జరిగిందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//
జోగులాంబ గద్వాల జిల్లా

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ  మండలం బింగిదొడ్డి గ్రామంలో గత నెలలో జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికలలో 101 ఓట్లు కౌంటింగ్ చేయకుండానే అభ్యర్థిని గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారని స్వతంత్ర అభ్యర్థి యు, నరసింహులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజు ఆరీ ఇచ్చిన నివేదికలో 101 తేడాను తాము గమనించామని ఈ విషయమై స్థానిక ఎంపీడీవో మరియు జిల్లా కలెక్టర్లకు కూడా ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమకు ఎన్నికల సంఘం న్యాయం చేస్తున్న వారాలసతో ఫిర్యాదు చేశామని న్యాయం జరగని పక్షంలో కోర్టుకు వెళ్లి న్యాయాన్ని కోరుదామని మీడియా ముందు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular