📄 ePaper
Monday, June 29, 2026
Homeతెలంగాణకోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు ఇన్స్పెక్టర్ శ్రీహరి

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు ఇన్స్పెక్టర్ శ్రీహరి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఖమ్మం:

సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఖమ్మం కోడి పందేలు నిర్వహించిన, ఇసుక అక్రమ రవాణా చేసిన  కఠిన చర్యలు తప్పవని సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు.పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు, పేకాట జరగకుండా  తీసుకుంటున్న చర్యలలో భాగంగా గతంలో సత్తుపల్లిలో కోడి పందేలు, జూదం నిర్వహించిన వారిని, అదేవిదంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికీ కౌన్సిలింగ్ నిర్వహించి తహసిల్దార్ ఎదుట 17 మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.  సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని చైనా మాంజాను విక్రయించే దుకాణాలు, గోదాంలు, మార్కెట్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చైనా మాంజాను ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక పక్షులు, పశువులు, ప్రజలు, ముఖ్యంగా బైక్లపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. చైనా మాంజాను విక్రయించడం, కొనుగోలు చేయడం పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం నేరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జైలు శిక్షతో పాటు రూ.పది వేల రూపాయలు  వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular