📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణమంగళగిరి అంజుమన్ భూములపై సీఎం స్పందించాలి

మంగళగిరి అంజుమన్ భూములపై సీఎం స్పందించాలి

📰 Generate e-Paper Clip

గుంటూరు జనవరి 7 (మనప్రజాప్రతినిధి ):

మంగళగిరిలోని 72 ఎకరాల అంజుమన్ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాధత్వం చేసే యోచననువిరమించుకోవాలనిఏఐవైఎఫ్ నేత వలి డిమాండ్ చేశారు.  సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గుంటూరు రానున్న సీఎం చంద్రబాబు మంగళగిరిలోని 72 ఎకరాల అంజుమన్ భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలనిడిమాండ్ చేశారు.
అంజుమన్ సంస్థ చైర్మన్ గా మరియు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సీఎం చంద్రబాబుతో అంజుమన్ ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు
అదే విధంగా ఇతర మతాల భూములను కానీ దేవాదాయ శాఖ భూమి కానీ మైనారిటీ వర్గానికి చెందిన భూములను అభివృద్ధి పేరుతో ప్రవేట్ సంస్థలకు వ్యక్తులకు కూడగట్టడం దుర్మార్గమైన చర్య అని అన్నారు,వెంటనే అంజుమన్ సంస్థ స్థలం విషయం లో లీజు ఆలోచన విరమించుకోవాలని కోరారు
రేపు చంద్ర బాబు గారు స్పష్టమైన హామీ రాని పక్షంలో  సిపిఐగా అన్ని పక్షాలను కలుపుకొని భవిష్యత్తు పోరాటాలకు సమయతం అవుతాం..ఈ కార్యక్రమం లో AISF జిల్లా కార్యదర్శి యశ్వంత్ నాయకులు అమర్నాథ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.