📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణసమాచార హక్కు చట్టాన్ని నిర్లక్షం చేస్తున్న ప్రభుత్వ అధికారులు

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్షం చేస్తున్న ప్రభుత్వ అధికారులు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్ధిపేట జిల్లా

సిద్ధిపేట జిల్లా జిల్లా కేంద్రంలోని  జిల్లా అధ్యక్షులు చుంచు రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ పాల్గొని, మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ అధికారులు సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ అడిగిన సమాచారాన్ని కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించకుండా, అవినీతిని నిర్మూలించకుండా పోయిందని అని అన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా సెక్షన్ 5(2),5(3)  ప్రకారం సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు నిర్వహించాలి కానీ అధికారులు నిర్వహించడం లేదు అని మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జైన శ్రీనివాస్, భూపతి, లక్ష్మీకాంత్ రెడ్డి, రమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.