Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుదేశ సంస్కృతి పరిరక్షణకు సిపిఐ పిలుపు

దేశ సంస్కృతి పరిరక్షణకు సిపిఐ పిలుపు

📰 Generate e-Paper Clip

సదాశివపేటలో ముగ్గుల పోటీలు-విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన సిపిఐ నాయకులు.
సదాశివపేట,జనవరి11(మనప్రజాప్రతినిధి):
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో సదాశివపేట సిపిఐ పట్టణ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల అనంతరం ముఖ్య అతిథులుగా హాజరైన పురం రమాదేవి, కటకం సప్న చేతుల మీదుగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజద్దీన్ మాట్లాడుతూ, నేటి యువత భారతీయ సంస్కృతిని మరిచి ప్రపంచీకరణ ప్రభావంతో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతూ తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలిసి తెలియని వయసులో నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.యువతను, దేశ సంస్కృతిని కాపాడేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ అనేక సంవత్సరాలుగా వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తన వంతు కృషి చేస్తోందని తెలిపారు. అలాగే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు కళా ప్రదర్శనలు, సెమినార్లు నిర్వహించి యువతను సరైన మార్గంలో నడిపించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి. షఫీ అహ్మద్, సత్యమ్మ, అను, సుజా, గంగమ్మ, సాధకాలి యాకూబ్, పూలమ్మ, వినోద, మంజుల, రజిని, లక్ష్మి, బిపాషా, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular