Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుచంద్రగిరి నూతన సర్పంచ్‌కు కురుమ సంఘం ఘన సన్మానం

చంద్రగిరి నూతన సర్పంచ్‌కు కురుమ సంఘం ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి,వేములవాడ.జనవరి14
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిధిలోని చంద్రగిరి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ముత్త సంజన మహేష్‌ను కురుమ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.బుధవారం గ్రామంలోని బీరప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షులు ముత్త ఎల్లయ్య మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో నూతన సర్పంచ్ చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సర్పంచ్ ముత్త సంజన మహేష్‌ను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా గౌరవించారు.ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు మోహన్, మంద మల్లేశం, ఏనుగుల అంజయ్య, ఏనుగుల అశోక్, మంద అనిల్ కుమార్, మల్లేశం, రవి కిరణ్, మధుతేజ, శశి కుమార్, మంద శ్రీనివాస్ పాల్గొన్నారు.అలాగే మహిళా విభాగం నుండి మంద మల్లవ్వ, మంద కనుకవ్వ, మంద పద్మ, ఏనుగుల లచ్చవ్వ, ముత్త వెంకట లక్ష్మి, పద్మ లక్ష్మి తదితరులు పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular