Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుగృహజ్యోతి పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్న కాంగ్రెస్

గృహజ్యోతి పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు నింపుతున్న కాంగ్రెస్

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డి పాలనలో పేదల ఇళ్లలో వెలుగులు
•సంక్షేమ పాలనకు నిదర్శనం-గృహజ్యోతి పథకం

ఉచిత విద్యుత్ బాండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు వెంకట్ రెడ్డి
నర్సాపూర్(మనప్రజాప్రతినిధి)జనవరి14
నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బాండ్లను కాంగ్రెస్ జిల్లా నాయకులు వెంకట్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా వ్యవసాయ బోరు మోటర్ కనెక్షన్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ బాండ్లను కూడా రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. ఉచిత విద్యుత్ సౌకర్యంతో పేద కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గిందని పేర్కొన్నారు.అలాగే రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular