📄 ePaper
Friday, June 26, 2026
Homeఆంధ్రప్రదేశ్కనుమ పర్వదినం వేళ గిరిప్రదక్షిణలో"ఎమ్మెల్యేబొజ్జల పాల్గొనింపు

కనుమ పర్వదినం వేళ గిరిప్రదక్షిణలో”ఎమ్మెల్యేబొజ్జల పాల్గొనింపు

📰 Generate e-Paper Clip

వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడిన గిరి ప్రదక్షిణ మార్గం
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి17
నేడు కనుమ పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలవెంకట సుదీర్ రెడ్డి ఘనంగా పాల్గొన్నారు. గాలిగోపురం సమీపంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ, ఎదురుసేవ మండపం వరకు నడక మార్గంలో కొనసాగి భక్తి శ్రద్ధల మధ్య పూర్తయ్యింది.ఈ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో వేలాదిగా భక్తులు తరలిరావడంతో గిరి ప్రదక్షిణ మార్గం భక్తులతో కిటకిటలాడింది. స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహ భరితంగా మార్చారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేపట్టి, శాంతి భద్రతలు, దర్శన సౌకర్యాలు పకడ్బందీగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular