📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

📰 Generate e-Paper Clip

యువతకు ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ
కొత్త ఓటర్ల నమోదుకు పిలుపు
ప్రజాస్వామ్య బలోపేతానికి యువత అడుగు

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి25
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పేడు మండలం మెర్లపాక పంచాయతీలో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మెర్లపాక గ్రామ సచివాలయం ద్వారా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి, పంచాయతీ ఇంచార్జ్ కేకే రమణ పాల్గొని ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు. యువత ఓటు నమోదు చేసుకొని ప్రజాస్వామ్య బలోపేతానికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పావని, నరసింహనాయుడు, గోపాల్ రెడ్డి, శివారెడ్డి, సురేంద్రబాబు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular