📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణసీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ కు తొగుట సీఐ షేక్ లతీఫ్

సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ కు తొగుట సీఐ షేక్ లతీఫ్

📰 Generate e-Paper Clip

(మనప్రజాప్రతినిధి//జనవరి 30):

రాయపోల్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్‌ను కోకో, కబడ్డీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొగుట సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ లతీఫ్ హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ఎంఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాయపోల్ మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి, రాయపోల్ సర్పంచ్ మాచింన్ పల్లి రాజు, ఏఎస్ఐ దేవయ్య, సీనియర్ అసిస్టెంట్ ముతలిఫ్‌తో సీనియర్ క్రీడా కారులు స్వామి అనీఫ్  పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అతిథులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.