Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజలే ప్రథమం…సమస్యలపై యుద్ధం-పంతులు తండా సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్.

ప్రజలే ప్రథమం…సమస్యలపై యుద్ధం-పంతులు తండా సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్.

📰 Generate e-Paper Clip

ఫిర్యాదు వచ్చిన క్షణాల్లోనే స్పందన…తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం.

ప్రజల సమస్యే తన బాధ్యతగా తీసుకున్న సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్
•ఇంటింటి నీటి కష్టాన్ని గంటల్లోనే తీర్చిన గ్రామ సర్పంచ్
•ఎన్నికల గెలుపు కాదు… ప్రజల సంతృప్తే నిజమైన విజయం

అక్కన్నపేటమండల్//మనప్రజాప్రతినిధి.జనవరి31
తారచంద్ తండా గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించే నల్లా మోటారు కాలిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు పంతులు తండా గ్రామ సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్ దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించారు.ప్రజల ఫిర్యాదును స్వయంగా విన్న సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్ తక్షణమే బోరు మోటారు వద్దకు చేరుకుని పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సిబ్బంది మరియు ఐకెపి సెంటర్ ఇన్‌చార్జి కిషన్‌తో కలిసి మోటార్‌ను విప్పించి వెంటనే రిపేర్ చేయించి తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు. దీంతో గ్రామ ప్రజలు ఊరట పొందారు.ఈ సందర్భంగా సర్పంచ్ లావుడ్య చిన్నా నాయక్ మాట్లాడుతూ, “నా వద్దకు వచ్చిన ప్రతి సమస్య నా బాధ్యత. ఎన్నికల్లో గెలుపు కంటే ప్రజల సమస్యను తీర్చినప్పుడే నిజమైన సంతోషం లభిస్తుంది. గ్రామ ప్రజల సంతోషమే నాకు ముఖ్యం” అని అన్నారు.గౌరవ మంత్రి గారి ఇలాఖాలో ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూడటం తమ బాధ్యత అని, సర్పంచ్‌గా మాత్రమే కాకుండా ప్రజల మనిషిగా ప్రతి కుటుంబం బాగోగులు చూసుకోవడమే తన బలమైన సంకల్పమని పేర్కొన్నారు.ఇకముందు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అన్ని సేవలను అందిస్తూ, గ్రామంలో ఏ సమస్య వచ్చినాపరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ లావుడ్య చిన్నా (రాజు) తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular