📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణఉపాధ్యాయుని సస్పెన్షన్ ఎత్తివేయాలి

ఉపాధ్యాయుని సస్పెన్షన్ ఎత్తివేయాలి

📰 Generate e-Paper Clip

మనప్రజాజాప్రతినిధి // నారాయణఖేడ్ జనవరి 31: ఖేడ్ మండలం వెంకటాపూర్ లోని ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనా విషయమై పాఠశాల ఉపాధ్యాయుడు కాశీనాథ్ కు ముందస్తు షోకాజ్ నోటీసులు జారీచేసి వివరణ తీసుకోకుండానే సస్పెన్షన్ విధించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, సాయులులు అన్నారు. శనివారం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ..పాఠశాల అవరణలో కిచెన్ షెడ్ నిర్మించిన సదరు పాఠశాలకు అందజేయలేరు అన్నారు.షెడ్డు లేకపోవడం వల్ల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ఇంటి వద్దే వంటలు వండి పాఠశాలలో వడ్డించడం జరుగుతుంది అన్నారు.కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మధ్యాహ్న భోజనంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేయడం సరికాదు అన్నారు.ఉపాధ్యాయుడి సస్పెన్షన్ వెంటనే ఎత్తివేసి కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.