•ఆధారాలు లేకపోవడంతో ఎస్-క్రాస్ కారులో తరలిస్తున్న నగదు స్వాధీనం
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి06
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం అగ్రహారం చెక్‌పోస్ట్ వద్దనిర్వహించిన తనిఖీల్లో నగదు పట్టుబడింది.కరీంనగర్ నుండి సిరిసిల్లకు వెళ్తున్న TS09E2219 నంబర్ గల ఎస్-క్రాస్ (S-Cross) కారును స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) అధికారులు ఆపి తనిఖీ చేశారు. కారులో తరలిస్తున్న రూ.1 లక్ష నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో అధికారులు ఆ నగదును సీజ్ చేశారు.పట్టుబడిన నగదును తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సరైన పత్రాలు లేకుండా రూ.50,000 కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లరాదని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు సూచించారు
అగ్రహారం చెక్‌పోస్ట్‌లో రూ.1 లక్ష నగదు సీజ్
RELATED ARTICLES

