Friday, February 13, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుశ్రీ సంగమేశ్వర ఆలయంలో ఘనంగా 11వ వార్షికోత్సవ ఉత్సవాలు

శ్రీ సంగమేశ్వర ఆలయంలో ఘనంగా 11వ వార్షికోత్సవ ఉత్సవాలు

📰 Generate e-Paper Clip


108 కలశాల ఊరేగింపు,పల్లకి సేవతో భక్తి వైభవం
మనప్రజాప్రతినిధ,//సదాశివపేట,ఫిబ్రవరి6.
సదాశివపేట పట్టణంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో 11వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీమాధవానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో ఆలయ పూజారులు జి. మోహన్‌రావు, బి.ఎన్. శంకర్రావు, నారాయణరావుల ఆధ్వర్యంలో ఉదయం దీపస్థాపన, ధ్వజారోహణం, గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనం, హోమం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహిళలతో సామూహికంగా 108 కలశాల ఊరేగింపును శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం నుండి గాంధీ చౌక్ మీదుగా తబల వాయిద్యాలు, శివనామస్మరణ, భజనల మధ్య నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న అనంతరం కలశాల నీటితో శ్రీ సంగమేశ్వర స్వామి మరియు పార్వతీమాతలకు అభిషేకం చేశారు.మడుగుల సర్వోత్తమ శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణను శ్రీ లక్ష్మీనరసింహ బుక్ స్టాల్, సంగారెడ్డి వారి సౌజన్యంతో చేపట్టారు. మాజీ కౌన్సిలర్ ఆకుల శివకుమార్ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, రాత్రి 8 గంటల నుండి భజన బృందాల ఆధ్వర్యంలో తెల్లవారుజామున వరకు భజన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మారేపల్లి శివకుమార్, గురుస్వామి రాచన్న, శ్రీరామ్ శ్రీనివాస్, మునిగి మల్లేశం, సుధాకర్, నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, శంకర్ గౌడ్, పరమేశ్వర్, రాజన్న స్వామి,సంగమేష్ స్వామి, మల్లేశం స్వామి తదితరులు, ఆలయ కమిటీ సభ్యులు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.వార్షికోత్సవం సందర్భంగా పూజారులు జి. మోహన్‌రావు దంపతులు, నారాయణరావు దంపతులు, శంకర్రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular