📄 ePaper
Wednesday, August 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామ భద్రతకు గ్రామస్థుల సహకారం – తిమ్మారెడ్డిపల్లిలో నిఘా కెమెరాల ఏర్పాటు నిర్ణయం

గ్రామ భద్రతకు గ్రామస్థుల సహకారం – తిమ్మారెడ్డిపల్లిలో నిఘా కెమెరాల ఏర్పాటు నిర్ణయం

📰 Generate e-Paper Clip

గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల విరాళాలతో త్వరలో నిఘా కెమెరాల ఏర్పాటు-భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు.

మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి7.కొండపాకమండలం..

కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో భద్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతో నిఘా కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం జరిగింది. కుకునూరుపల్లి పోలీసు అధికారి తో పాటు తోగుట పోలీసు అధికారి లతీఫ్ పాల్గొని, గ్రామ భద్రతలో నిఘా కెమెరాల అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మూడు నిఘా కెమెరాలను అందించేందుకు అంగీకరించగా, గ్రామానికి చెందిన ఎలు రామ్ రెడ్డి ఒక కెమెరాను అందించేందుకు ముందుకు వచ్చారు. గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు కలిసి నిఘా కెమెరాల ఏర్పాటు కోసం రూ.1,05,000 మొత్తాన్ని సమకూర్చాలని నిర్ణయించారు.అవసరమైన నిధులు సేకరించిన వెంటనే రెండు రోజుల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.కెమెరాల నిర్వహణ పంచాయతీ కార్యదర్శి,గ్రామ సర్పంచ్ గ్రామ పోలీసు అధికారి నరేందర్ పర్యవేక్షణలో కొనసాగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.