Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజూబ్లీహిల్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ అభినందనలు

జూబ్లీహిల్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్‌కు సీఎం రేవంత్ అభినందనలు

📰 Generate e-Paper Clip

_ఉప ఎన్నిక విజయంలో పొన్నం ప్రభాకర్ కృషికి ప్రశంస

_ప్రచారం ప్రారంభం నుంచే కాంగ్రెస్ బలోపేతం చేసిన నేత

_రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంచిన వేళ

    (హైదరాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):
    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గెలుపు కోసం ప్రారంభ దశ నుంచేప్రణాళికాబద్ధంగా పనిచేసినపొన్నంప్రభాకర్కలకపాత్రనుగుర్తిస్తూసీఎంఆయనకుశుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ విజయంలో ఆయన శ్రమ, కట్టుబాటు ప్రధాన కారణమని రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా నిలిచిన జూబ్లీహిల్స్‌కి, ప్రచారం ప్రారంభం నుంచే కాంగ్రెస్ శ్రేణులను సమన్వయం చేసిన నేతగా పొన్నం ప్రభాకర్ పనిచేశారు. బూత్ స్థాయి కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసి, ప్రచార వ్యూహాలను రూపొందించి, స్థానిక సమస్యలను సక్రమంగా ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కల్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గెలుపు అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచేలా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఉల్లాసాన్ని నింపాయి. “జూబ్లీహిల్స్ గెలుపు ప్రతి కార్యకర్త కృషి ఫలితం” అని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ చూపిన నాయకత్వాన్ని ప్రశంసించారు. ప్రచారం మొత్తం కాలంలో ఆయన చూపిన చురుకుదనం, బాధ్యతాయుత వైఖరి కాంగ్రెస్ గెలుపులో కీలక అంశంగా నిలిచింది.ఈ అభినందనలు పార్టీ అంతర్గతంగా కొత్త ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగే రాజకీయ కార్యక్రమాల్లో కూడా పొన్నం ప్రభాకర్ పాత్ర మరింత ప్రధానమవుతుందని నేతలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ విజయం కాంగ్రెస్‌కు మొన్నటివరకు నెలకొన్న ఉత్సాహాన్ని మరింత పెంచే దిశగా దోహదం చేసింది.

    RELATED ARTICLES
    - Advertisment -ads

    Most Popular