📄 ePaper
Saturday, July 11, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపంట పొలంలో జింక ప్రత్యక్షం

పంట పొలంలో జింక ప్రత్యక్షం

📰 Generate e-Paper Clip

•పొలంలోకి చేరిన జింకను సురక్షితంగా అడవికి తరలించిన అటవీశాఖ అధికారులు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మార్చి4
మండల పరిధిలోని వెలికట్ట గ్రామ శివారిలో మంగళవారం ఓ జింక ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన రైతు పొలంలోకి జింక వచ్చి కొంతసేపు దిగబడి ఉండటాన్ని రైతు గమనించాడు. వెంటనే ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జింకను సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గ్రామస్తులు ఆసక్తిగా జింకను చూసేందుకు అక్కడికి చేరుకున్నారు.
అటవీ అధికారులు అడవి జంతువులు గ్రామాల వైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరూ వాటిని భయపెట్టకూడదని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular